అమరావతి నూతన నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి అన్నారు. పదేళ్ల నవ్యాంధ్ర చరిత్రలో గత ఐదేళ్ల పాలనలో దాదాపు 30 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లి రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది అన్నారు. సముద్ర కెరటాలే నాకు ఆదర్శంఅని లేచి పడుతున్నందుకు కాదు పడిన లేచినందుకు అన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపైనే ఉందన్నారు. ఇందుకోసం చేయి చేయి కలుపుదాం స్వర్ణాంధ్రను సాధిద్దాం అనే నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ అమరావతి నిర్మాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు 116 రూపాయలు విరాళాన్ని సిఆర్డిఏ ఖాతాలో జమ చేస్తారని ఆశిస్తున్నామన్నారు. అంతేకాకుండా యువత ప్రజలు తమ ఆర్థిక స్తోమతను బట్టి విరాళాలు అందించి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిందిగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి విజ్ఞప్తి చేస్తున్నారు. కమిషనర్ ఏపీ సి ఆర్ డి ఏ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లబ్బీపేట విజయవాడ, ఎకౌంట్ నెంబర్ 034310100118883 నెంబర్ కు లేదా చెక్కులను కమిషనర్ ఏపీ సి ఆర్ డి ఏ విజయవాడ పేరు మీద పంపించవచ్చునని తెలిపారు.
233 1 minute read