ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ బుధవారం సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. భేటీలో కూటమి పార్టీల మధ్య భవిష్యత్తు కార్యాచరణ, పాలనా వ్యూహాలు, రాష్ట్రాభివృద్ధిపై కేంద్రం సహకార అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాధవ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.