పల్నాడు జిల్లా, వినుకొండ.
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జివి..
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో గురువారం జరిగిన , మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో *ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జి.వి. ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జివి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమన్వయం ఎంత అవసరమో వివరించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పాఠశాల అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ అభివృద్ధి కి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.