ఏలూరు నగరంలోని అమీనా పేటలో ఉన్న శ్రీ దుర్గా భవాని ఆలయంలో ఈరోజు బోనాల జాతర అమ్మినపేట పురవీధులలో ఆలయం నుంచి బయలుదేరి రంగ రంగా వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు బోనాలు తలపై పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారికి సారే సమర్పణతోపాటు బోనాలు సమర్పిస్తున్నారని అదే విధంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సాయంత్రం కుంకుమార్చన భజనలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే శ్రీ దుర్గా భవాని మాత ఆశీస్సులతోపాటు తీర్థప్రసాదాలు తీసుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి లక్ష్మణరావు ,వేగి రాము , వంశీకృష్ణ ఆళ్ల సోమ నాయుడు నమ్మి జనార్ధన కృష్ణ, దొడ్డి ముత్యాల నాయుడు, చిలక రాద పలువురు పాల్గొన్నారు.
238 Less than a minute