పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం.
రేమిడిచర్ల వద్ద తప్పిన ఆర్టీసీ బస్సు ప్రమాదం: ప్రయాణికులందరూ సురక్షితం
బొల్లాపల్లి మండలం, రేమిడిచర్ల గ్రామ సమీపంలో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది.
వినుకొండ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
అయితే, బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు రేమిడిచర్ల వద్దకు చేరుకోగానే స్టీరింగ్ రాడ్ ఊడిపోయింది.
దీంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది.
ఈ ఆకస్మిక ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే, డ్రైవర్ చాకచక్యంతో రోడ్డు పక్కన పెద్ద గుంతలు లేకపోవడం, ఎటువంటి చెట్లు అడ్డులేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బస్సు నెమ్మదిగా రోడ్డు పక్కకు జరగడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.