Kota Srinivasa Rao passes away | కోట శ్రీనివాసరావు కన్నుమూత
కోట శ్రీనివాసరావు కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట.. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు.. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసిన కోట శ్రీనివాసరావు.. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట.. 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం.. 9 నంది అవార్డులు అందుకున్న కోట.. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు..