గుంటూరు జిల్లా వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు గారి 60వ జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. స్థానిక సీతయ్య నగర్ లో ఎన్డీఏ కూటమి నేతలు, తెలుగు దేశం మరియు జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు.
జి.వి. ఆంజనేయులు గారు పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నిలిచారని, ఆయన సేవలే ఆయనకు ఈ స్థానం తెచ్చిపెట్టాయంటూ నాయకులు అభిప్రాయపడ్డారు.
కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కార్యకర్తలు, యువత, వార్డు ప్రజలు ఆయన ఆరోగ్య సౌఖ్యం కోసం ప్రార్థించారు. వినుకొండ అభివృద్ధి దిశగా ఆయన నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని వార్డులోని ప్రజలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ వల్లూరి మురళీకృష్ణ, వార్డు అధ్యక్షులు ఏకో నారాయణ, యండ్రపల్లి ఆదిరాములు, జనసేన నాయకులు అంతు వీరప్రసాద్, సిద్ది అనిల్ కుమార్, అడపాల కిరణ్, టీడీపీ కార్యదర్శి దూదేకుల హుస్సేన్ ఫీరా(బాల), బూత్ కన్వీనర్ ఏకో శ్రీనివాస్, నిస్సంకర ప్రసాద్, విద్యార్థి నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.
కూటమి నేతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవి ఆంజనేయులు గారి ఆశీస్సులు పొందేలా సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యకర్తల సమన్వయంతో ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
వినుకొండ ప్రజలు ఈ వేడుకలను ఓ కుటుంబంలా జరుపుకుని ఆయనకు మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ ప్రాదేశిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.