పేదల పాలిటి పెన్నిధి సీఎం సహాయ నిధి: చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
పల్నాడు జిల్లా వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు సీఎం సహాయ నిధి ద్వారా 48 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 85,08,024 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో ఆపత్కాలంలో ఊరటనిచ్చే గొప్ప పథకమని పేర్కొన్నారు.
ఆర్ధికంగా వెనుకబడిన వారు వైద్య చికిత్స పొందలేక ఇబ్బందులు పడకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ఈ నిధులు సకాలంలో అందుతున్నాయని తెలిపారు. వైద్య సహాయాన్ని వినియోగించుకునేలా ప్రజలు ముందుకు రావాలని, అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
ఈ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సమస్యను పట్టించి తమకు సహాయం అందేలా కృషి చేసిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా వేలాది మంది పేదవారికి జీవనాధారంగా మారుతోందని వారు చెప్పారు.