ఆంధ్రప్రదేశ్
సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ.
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట
సీఎం సహాయనిధి నుండి సాయంలో భాగంగా శనివారం తన నివాసంలో శాసనసభ్యులు పుల్లారావు పలువురికి నగదు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్యసేవలు పొందిన నలుగురికి రూ. 2 లక్షల 28 వేల రూపాయల చెక్కులను పుల్లారావు స్వయంగా అందించారు. ఆపదలో ఉన్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం చేయూత ఇవ్వడం హర్షణీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ నందమూరి క్రిస్టర్, తెలుగుదేశం నాయకులు యస్.యస్. సుభానీ , మద్దూమల రవి తదితులున్నారు.