తాడేపల్లి పట్టణంలోని 13వ వార్డు నందు రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గోరేబాబు ఆధ్వర్యంలో ఘనంగా “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమం
తాడేపల్లి పట్టణంలోని 13వ వార్డు నులకపేట మసీద్ సెంటర్ నందు “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమి రెడ్డి విచ్చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి సంవత్సరం కాలం గడిచిన వాటిని అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు, ఎన్నికలకు ముందు అధికారం కోసం దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు అడిగే వారి మీద ఎలా కక్షపూరిత రాజకీయాలు చేసి కేసులు పెడుతున్నారు, బాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీల ద్వారా ప్రజలకు రావలసిన సంక్షేమాలు ఈ సంవత్సర కాలంలో ఎంత మోసపోయారు అన్నది వివరించారు. అలాగే పార్టీ బలోపేతం కోసం వార్డు కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గోరేబాబు, నులకపేట పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ ఉపాధ్యక్షులు జిలగా పెదగాలయ, వేల్పుల ఎలీషా, ప్రధాన కార్యదర్శులు చిన్నపోతుల దుర్గారావు, చిట్టిమల స్నేహసంధ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి విజయ శ్రీ మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.