
రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో చీరాల మునిసిపాలిటీకి చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు ప్రకటించారు. ప్రజాసేవే తన ధ్యేయమని పేర్కొన్న ఆయన, గతంలోనూ చీరాలలో ప్రజల నమ్మకాన్ని పొందిన తాను, ఇప్పుడు మరింత సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నానన్నారు.
ఈరోజు మల్లెల బుల్లిబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లెల బుల్లిబాబు మాట్లాడుతూ – ప్రజలు ఇచ్చిన ఆదరణతోనే తాను ఈస్థాయికి వచ్చానని, ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా మునిసిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
చీరాల పట్టణంలోని మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, వీధి లైటింగ్, రోడ్లు, శుద్ధి వ్యవస్థ వంటి అంశాల్లో మరింత అభివృద్ధి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనను అందించడమే తన లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మల్లెల బుల్లిబాబు కు అభినందనలు తెలిపారు.







