గుంటూరులో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి పండుగ సందర్భంగా సోమవారం పూర్ణ కుంభం స్వాగతం, సన్నాయి మేళతాళాలు, భోగి మంటలు, గంగిరెద్దుల ,విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, చిన్నారులకు భోగిపళ్లతో ఎన్టీఆర్ స్టేడియం పండగ శోభను సంతరించుకుంది. సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిధిలుగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సంబరాలో ఎక్కువ మంది సాంప్రదాయక దుస్తులు ధరించి అలరించారు. సంబరాల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి లోగిళ్లు ప్రతి ఒక్కరికి గ్రామీణ వాతావరణంను చూపింది.
132 Less than a minute