Sankranti celebrations under the leadership of Minister Nimmala Ramanaidu
ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు… రాత్రి ఫ్లడ్ లైట్లలో వాలీబాల్ పోటీలు,హోరాహోరీగా తలబడుతున్న జట్లు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు: సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుచున్న కలిదిండి రామరాజు సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీల్లో రెండో రోజు ఆదివారం రాత్రి ప్లడ్ లైట్లలో ఉత్కంఠంగా సాగాయి. స్థానిక బి ఆర్ ఎం వి మున్సిపల్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జరిగిన ఈ పోటీల్లో తలపడిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన జట్ల క్రీడాకారులు గెలుపు కోసం హోరాహోరీగా తలబడ్డారు. మహిళలు, పురుషుల వేర్వేరు విభాగాలకు జరిగిన పోటీలో ఆటలు తిలకించిన క్రీడా అభిమానులు, ప్రజలు ఎవరు గెలుస్తారోనని చివరివరకు ఆసక్తిని కనబరిచారు. పోటీలను ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్, మంత్రి నిర్మల రామానాయుడు తిలకించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈరోజు మహిళల విభాగంలో కడప జిల్లా జట్టు పై కృష్ణాజిల్లా జట్టు గెలుపొందింది. సిద్దిపేట జట్టు, నిజామాబాద్ జట్టు పై తలపడి విజయం సాధించింది. పురుషుల విభాగంలో శ్రీకాకుళం జట్టు, తూర్పుగోదావరి జిల్లా జట్టుపై విజయం సాధించింది. తూర్పుగోదావరి జిల్లా జట్టు, కృష్ణా జిల్లా జట్టుపై గెలుపొందింది. ప్రకాశం జిల్లా జట్టు, సాయి వైజాగ్ జట్టుపై విజయం సాధించింది. మూడో రోజు సోమవారం సాయంత్రం ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల కోసం సెమీ ఫైనల్ కు చేరుకున్న జట్లు పోటీ పడనున్నాయి.