Site updated! Enjoy the latest version of CityNewsTelugu.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) – రష్యన్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఆంట్రప్రెన్యూర్స్ (RSPP) మధ్య నైపుణ్యాభివృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో రష్యా ప్రతినిధి బృందం నేడు రాష్ట్రాన్ని సందర్శించింది. పరిశ్రమ & వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు, రష్యన్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఆంట్రప్రెన్యూర్స్ (RSPP) , ప్రముఖ విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు ఈ బృందంలో పాల్గొన్నారు. ఈ సమావేశం టెక్నికల్ మరియు వొకేషనల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (TVET) రంగంలో అంతర్జాతీయ సహకారానికి ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
 
విశాఖపట్నం లోని ఫోర్ పాయింట్స్ షెరటాన్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్ (SD&T) ప్రధాన కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారు మరియు APSSDC మేనేజింగ్ డైరెక్టర్ & CEO శ్రీ గణేష్ కుమార్ గారు ప్రారంభించారు. రష్యన్ బృందానికి RSPP డిప్యూటీ చైర్మన్ శ్రీ ఇవనోవ్ మైఖేల్ సారధ్యం వహించారు. మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డింగ్, మెటలర్జీ రంగాల్లో నైపుణ్యం కలిగిన 12 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. శ్రీమతి సీతా శర్మ , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు.
 
ముఖ్యాంశాలు:
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్య & నైపుణ్య ఎకోసిస్టమ్ పై శ్రీ కోన శశిధర్ గారు రష్యన్ ప్రతినిధులకు వివరించారు.
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయాల కీలక పాత్రపై ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. జి.పి. రాజశేఖర్ గారు సూచనలు చేశారు.
రష్యా ప్రతినిధులు ఇండస్ట్రీ–అకాడెమియా భాగస్వామ్యాలు మరియు ప్రాంతీయ పరిశ్రమలకు అనుకూల సాంకేతికతలపై చర్చించారు
సిలబస్ రూపకల్పన, ప్రాక్టికల్ శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌లు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ తదితర అంశాలపై సంయుక్త చర్చలు జరిగాయి.
ఈ సమావేశంలో APSSDC మరియు RSPP మధ్య Letter of Intent (LoI)పై సంతకాలు జరిగాయి. దీని ద్వారా సంయుక్త ప్రాజెక్టులు, శిక్షణా కార్యక్రమాల రూపకల్పన, జ్ఞాన మార్పిడి, వ్యూహాత్మక సహకారం కోసం మార్గం సుగమం కానుంది. ఈ ఒప్పందం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ యువతకు దేశీయంగా మరియు రష్యన్ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు మెరుగుపడనున్నాయి.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker