వైఎస్సార్సీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా నియమితులైన గజ్జల సుధీర్ భార్గవరెడ్డి సోమవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరులోని అంబటి నివాసంలో భేటీ అయి సత్తెనపల్లి రాజకీయాలు గురించి సుదీర్ఘంగా చర్చించారు. సుధీర్ కి పూర్తిగా అండగా ఉంటానని ఆయన తెలిపారు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ ఇన్చార్జిగా నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ నిర్ణయం ప్రకారం తాను పని చేస్తానని అంబటి తెలిపారు.
161 Less than a minute