గుంటూరు
Trending
Guntur News : పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఇంటిపై దాడి
Attack on YSRCP Leader
పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నంబూరు శంకర్రావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో నంబూరు శంకర్రావు అనుచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పెదకూరపాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ గెలుపొందారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుండి కొన్ని ప్రాంతాల్లో టిడిపి ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుమ దాడులు జరుగుతున్నాయి. గతంలో పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులపై తీవ్రంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నంబూరు శంకర్రావు ఇంటిపై కూడా దాడి జరిగింది. ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.