ఆంధ్రప్రదేశ్తిరుపతి
Thirupati :పక్షులు పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ -2025
పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 ఈ నెల18,19 మరియు 20 తేదీలలో మూడు రోజులపాటు వైభవంగా తిరుపతి జిల్లాలోని 5 ప్రాంతాలలో నేలపట్టు, అటకానితిప్ప, సూళ్లూరుపేట, బీవీపాలెం, శ్రీ సిటీ నందు నిర్వహించనున్న నేపథ్యంలో గౌ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేటి సోమవారం రాత్రి నారావారిపల్లి నందు వారి స్వగృహంలో కలెక్టర్ మరియు ఛైర్మన్, జిల్లా టూరిజం కౌన్సిల్ తిరుపతి డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, సూళ్లూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, ఎంఎల్ఏ చంద్రగిరి పులివర్తి నాని కూడా ఉన్నారు.