జాతీయ వార్తలుHealthతెలంగాణ
AIG HOSPITAL : క్యాన్సర్ రోగులకు ప్రోటాన్ బీమ్ థెరపీ’ ద్వారా అత్యాధునిక చికిత్స.
Hyd :క్యాన్సర్ రోగులకు ప్రోటాన్ బీమ్ థెరపీ’ ద్వారా అత్యాధునిక చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇందు కోసం రూ.400 కోట్ల వ్యయంతో డైనమిక్ ఏఆర్‌సీ సహా అత్యాధునిక ప్రోటోస్ వన్-ప్రోటాన్ థెరపీ సిస్టమ్‌ను దిగుమతి చేసుకునేందుకు బెల్జియంకు చెందిన ఐబీఏ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. రూ 300 పడకల సామర్థ్యంతో ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అంకాలజీ విభాగంలో ఈ ప్రోటాన్ బీమ్ థెరపీని అందుబాటులోకి తెస్తామని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు