సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల లో
సేల్స్ పోర్స్ టూల్ పై శిక్షణా శిభిరం
సెయింట్‌ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల నందు సేల్స్ ఫోర్స్ టూల్‌పై 6 రోజుల ట్రైనింగ్ ది. 25`8`2025 నుండి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తముగా ఒక ప్రకటనలో తెలిపారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగము వారి ఆధ్వర్యములో సేల్స్ ఫోర్స్ టూల్ పై శిక్షణా శిభిరాన్ని ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. జగదీష్ బాబు తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ లో భాగమైన సేల్స్ ఫోర్స్ టూల్ పై నెక్సట్ జెన్ స్కాలర్స్ ప్రవేట్ లిమిటెడ్,హైదరాబాద్ వారి ఆధ్వర్యములో నిర్వహిస్తున్నట్లు సి.యస్.ఇ విభాగాధిపతి డా॥ పి.హరిణి తెలిపారు. నెక్సట్ జెన్ స్కాలర్స్ ప్రవేట్ లిమిటెడ్ తరపున జె వంశీకృష్ణ విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమములో బి.టెక్ నాల్గవ సంవత్సరము చదువుతున్న విద్యార్దులు ఈ శిక్షణా శిబిరములో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ శిక్షణా శిభిరమునకు శేషసాయి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.