ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేసేందుకు బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయడం సరైన విధానం కాదన్నారు. నియంత పరిపాలనకు ఇది నిదర్శనం అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. చమురు దిగుమతుల్లో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. చమురు దిగుమతులు చేసి ఏ కంపెనీలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో రూ. 14.5 లక్షల కోట్లు రుణ మాఫీ చేసిందని చెప్పారు. అయితే ఎవరికి ఈ రుణ మాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో లక్షన్నర కోట్ల రూపాయలు కమీషనర్ రూపంలో తీసుకున్నారని ఆయన వెల్లడించారు. బడా వ్యాపారులకు కాకుండా రైతులకు రుణ మాఫీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పై చేసిన విమర్శలను ఆయన ఖండించారు.
246 Less than a minute