అమరావతి రాజధానిలో ప్రైవేట్ యూనివర్సిటీలకు 100 ఎకరాలు చొప్పున భూములు కేటాయించడం సరైన విధానం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు తెలిపారు. బ్రాడీపేట జిల్లా సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 10 వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారు చౌకగా కేటాయించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు విద్యార్థులు, ప్రజలకు చెందాలని సూచించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన కూలీలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందుకోసం స్థానిక విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు భూముల కేటాయింపు పై శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు వై. నేతాజీ, నళినీకాంత్, భావన్నారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
231 Less than a minute