ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం లి., తాడేపల్లి అమరావతి వారి ద్వారా ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన పధకము (PM-AJAY) 2023-24 వ ఆర్ధిక సం.ము క్రింద షెడ్యూల్డ్ కులముల (SC) యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం జిల్లా SC సొసైటీల ద్వారా ఎంపిక చేయబడిన Andhra Pradesh Public Transport Department (APPTD) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) యొక్క HMV డ్రైవర్ శిక్షణ పాఠశాల, గుంటూరులో హెవీ మోటార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమము నిర్వహించబడును. యస్.సి. నిరుద్యోగ (5) మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా వారం రోజులు పొడిగించటమైనది. ఈ శిక్షణ 40 రోజులుగా ఉంటుంది.
ఎంపికయ్యే అభ్యర్థుల అర్హత ప్రమాణాలు:
• అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం కాలపరిమితి గల LMV లైసెన్స్ కలిగి ఉండాలి,
• అభ్యర్థులు హెవీ డ్రైవింగ్ LLR కలిగి ఉండాలి. (ప్రస్తుతం LLR పొందడానికి నిర్దేశించిన
రుసుము రూ.210/- మరియు రుసుము రూ.210/- అభ్యర్థి మాత్రమే భరించాలి.
• అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్ట వయోపరిమితి
లేదు, అయితే 40 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు HMV డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి
మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. హెవీ డ్రైవింగ్ LLR అభ్యర్థులు వారి స్వంత
ఖర్చుతో వ్యక్తిగతంగా పొందాలి.
డ్రైవింగ్ టెస్ట్ ఫీజు: అభ్యర్థులు డ్రైవింగ్ టెస్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ కోసం వర్తించే విధంగా రవాణా శాఖకు రుసుము చెల్లించాలి. (ప్రస్తుతం HMV డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి రుసుము రూ. 1060/- మరియు రుసుము రూ. 1060/- అభ్యర్థి మాత్రమే భరించాలి.
కావున ఆసక్తి కలిగిన యస్.సి. నిరుద్యోగ మహిళలు తేది.30-08-2025 నుండి 05-09-2025 సా.5.00 గం.ల లోపు యస్.సి. కార్పొరేషన్, గుంటూరు వారి కార్యాలయము నందు దరఖాస్తు ఫారమును తీసుకోని సంబంధిత దృవ పత్రములతో పై తేదిలలో ఈ కార్యాలయములో అందజేయవలసియున్నది.
వివరములకు: 9849905967 సంప్రదించగలరు.
2,235 1 minute read