మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈమేరకు ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు. దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు. .
159 Less than a minute