గుంటూరు పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న, చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రైల్వే సంబంధిత బ్రిడ్జి పనులు అలాగే హౌసింగ్ శాఖకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహించాము. రైల్వే వంతెనకు సంబంధించి శంకర్ విలాస్ నిర్మాణంలో పెండింగ్లో ఉన్న పనుల వివరాలు, ఎల్. సి. నెంబర్ 3 & 6, గుంటూరు – నంబూరు – నల్లపాడు – బండారుపల్లి, పలకలూరు ఆర్వో బీలు కూడా టెండర్ దశ పూర్తి చేసుకోగా శంకుస్థాపనలకు కార్యాచరణ రూపొందిస్తున్నాము. మంగళగిరి – నిడమర్రు నిర్మాణానికి సంబంధించి ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నాము. శ్యామల నగర్, సంజీవయ్య నగర్ పనులపై అధికారులతో రివ్యూ చేసి పలు అంశాలపై స్పష్టమైన వివరాలు అడిగి తెలుసుకున్నాము. పెదకాకాని గేటు వద్ద ROB ఏర్పాటుకు స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆ నిర్మాణానికి చర్య తీసుకుంటాం. స్థానికంగా కొన్ని ఆక్రమణలను తొలగించాల్సి ఉంటుంది. అందుకు స్థానికుల నుంచి అంగీకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో ఉన్నాము. నూతన రైల్వే స్టేషన్ ను ఆధునికరించమని అధికారులకు గతంలోనే సూచించాము. అందుకుగాను సుమారు రూ. 5 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి అని చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, డీ ఆర్ వో కాజావలి, ఎమ్మెల్సీ ఏసు రత్నం, రైల్వే డిఆర్ఎం సుదేశ్న సేన్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తదితరులు పాల్గొన్నారు.
253 1 minute read