
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి రోడ్, గౌతమి నగర్ 3వ లైన్, విద్యానగర్ 1వ లైన్, కొండయ్య కాలనీ మండపాలలో భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… గణేశ్ చతుర్థి పండుగలు మత సామరస్యం, ఐక్యతకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ శాంతి సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. స్థానికులు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి తమ కాలనీల సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.
 
 
 
  
 






