ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈరోజు జనజాతి విద్యాలయాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 4వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు (Sports Meet – 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని 171 ఆశ్రమ పాఠశాలలు మరియు 28 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. మొత్తం 22416 మంది బాలురు, 20086 మంది బాలికలు చదువుతున్న ఈ పాఠశాలల నుండి ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మంత్రి గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ₹340 కోట్లు ఖర్చు చేస్తోంది. క్రీడా సామాగ్రి, క్రీడాకారుల వసతి, భోజనం, శిక్షణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి క్రీడా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ,“గిరిజన విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. క్రీడల ద్వారా గిరిజన యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ క్రీడా పోటీలు వారి ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా నిలుస్తాయి” అని అన్నారు.
231 1 minute read