ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అధినేత మంత్రి నారా లోకేష్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయాల్లో సంస్కార హీనంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చేరిగారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ పైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తనకు పోటీ వస్తాడని ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే లోకేష్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. హద్దు మీరి వైయస్సార్ కుటుంబంపై మరోసారి విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఈనెల 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నట్లు పార్టీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
234 Less than a minute