కోనసీమ జిల్లా జగ్గన్న తోట ప్రతీ సంవత్సరం కనుమ నాడు జరిగే ప్రబల తీర్థం అనేది 400 ఏళ్ల నాటిచరిత్ర!
ప్రతీ సంవత్సరం కనుమ నాడు జరిగే ప్రబల తీర్థం అనేది 400 ఏళ్ల నాటి ప్రాచీనమైన పండుగ ముఖ్యంగా జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం వీక్షించడానికి కొన్ని లక్షల మంది ప్రజలు అనేక జిల్లాల నుండి వస్తుంటారు . ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు అమలాపురం ఎంపీ గంటి హరీష్,పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మరియు ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి హాజరవ్వడం జరిగింది. దీనిని రాష్ట్ర పండుగగా మార్చడానికి తగిన ప్రయత్నాలు చేయమని వినతిపత్రాన్ని ఉత్సవ కమిటీ తేజస్వి కి అందించడం జరిగింది. ఇటువంటి వేడుకలు కచ్చితంగా రాష్ట్రానికి చాలా ముఖ్యమైనవని వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వద్దకు ఈ వినతిని తీసుకువెళ్లి రాష్ట్ర పండుగ మార్చేందుకు కృషి చేస్తానని తేజస్వి తెలియజేయడం జరిగింది
ekkada jaruguthundi idi