chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍నంద్యాల జిల్లా

ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ||Child Welfare Through Government Department Coordination

నంద్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో “స్నేహపూర్వక న్యాయ సేవల పథకం–2024” పై బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ, సమాజంలోని పిల్లల సంరక్షణ, రక్షణ బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకోవాలన్నారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం దక్కేలా చూడాలన్నారు.

లీగల్‌ సర్వీసెస్‌ యూనిట్‌ మెంబర్‌, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌ మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. దివ్యాంగులైన పిల్లలను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నట్లు రిసోర్స్‌ పర్సన్‌, కర్నూలు డిజేబులిటీ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ డైరక్టర్‌ రైస్‌ ఫాతిమా చెప్పారు.

నంద్యాల అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శారదాబాయి మాట్లాడుతూ, అవసరమైన పిల్లలకు చికిత్సలు, ఉచితంగా మందులు అందిస్తున్నట్లు చెప్పారు. బడికి వెళ్లని పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ విజయ తెలిపారు. సమస్యలు ఉంటే చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1098కి ఫోన్‌ చేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌, రిసోర్స్‌ పర్సన్‌ రైస్‌ ఫాతిమా, నంద్యాల అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శారదాబాయి, ఐసీడీఎస్‌ పీడీ విజయ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker