ప్రపంచంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించేలా విద్యార్ధులను తీర్చదిద్దగల మహోన్నతమైన వారు విద్యనేర్పించే గురువులు అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టీనా తెలిపారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కళ్యాణమండపంలో జరిగిన గురుపూజోత్సవం 2025 వేడుకలలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టీనా, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాదు, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు గళ్లా మాధవి, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చెర్మన్ మన్నవ మోహన కృష్ణ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు సజీలా, జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుక తో కలసి పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధ కృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టీనా మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా డా. సర్వేపల్లి రాధ కృష్ణ డా.సర్వేపల్లి రాధ కృష్ణన్ దేశానికి ఎనలేని సేవలు అందించారని, ఆయన జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటూ ఆయన స్పూర్తిని, అశయాలను గర్వంగా స్మరించుకుంటున్నామన్నారు. విద్యావంతులుగా తీర్చిదిద్దే గురువును తల్లి, తండ్రి తరువాత దేవుడు కంటే ముందుగా నమస్కారం తెలిపి గౌరవించే సంప్రదాయం మన దేశంలో ఉందన్నారు. గురువులు తరగతిగదులలో చేస్తున్న కృషి, ప్రోత్సహం వలనే సమాజంలో ఎంతో మంది ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చినందు వలనే తాను ఉన్నత స్థాయి పదవులను సాధించటం జరిగిందన్నారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాలు మెరుగుదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో అన్నిరకాల మౌళిక సౌకర్యాల కల్పనతో పాటు, డిజిటల్ బోర్డులపై నాణ్యమైన విద్యను బోదిస్తున్నారన్నారు. విద్యాప్రమాణాలు మరింత మెరుగుపర్చేలా పూర్తి స్థాయిలో ప్రణాళికలు అమలు చేస్తూ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు స్వీకరిస్తున్నవారికి, ఇతర ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
230 1 minute read