తురకపాలెంలో స్థితిగతులను, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంప్ ను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. హెల్త్ క్యాంపు ద్వారా అందుబాటులో ఉంచిన మెడిసిన్స్, పరీక్ష యంత్రాలు తదితరాల గురించి వైద్య సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడికి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే బి.రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని పరామర్శించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తాగునీరు వల్ల ఈ వ్యాధి వస్తుంది అనడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ పూర్తిగా ఆపోహాలు. వీటిని నమ్మవద్దు. అరుదైన వ్యాధి కావడం ఎవరికి సరైన అవగాహన లేకపోవడం, తెలుసుకునేందుకు కొంత సమయం పట్టడం వల్ల ఇలాంటి అపోహలు వ్యాప్తి చెందాయి, తప్ప ఇందులో నిజం లేదు. ఇది కామన్ డిసీజ్ కాదు. నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేసిన సమయంలో కూడా ఇలాంటి డిసీస్ చూడలేదు. ఇది సవివరమైన పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే తేల్చి చెప్పగలం. ఇక్కడున్న వైరస్ మెలియాయిడోసిస్ అనేది రెండు రకాలుగా సంభవిస్తుంది. వాతావరణంలో తేమ శాతంలో వచ్చిన మార్పుల వల్ల ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. విపరీతమైన వర్షాలు కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు, స్కిన్ ద్వారా, ఊపిరి పీల్చుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం లేదా కిడ్నీ, హార్ట్ సమస్యలు ఉన్న వ్యక్తులకు ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి నాలుగు రకాల యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ ప్రాంతంలో ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, వారికి మళ్ళీ బ్లడ్ కల్చర్ తీసి సవివరమైన రికార్డులు సేకరించి, అవసరమైన వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి జాగ్రత్తగా తీసుకోవడం మా బాధ్యతగా తీసుకుంటాము. మరణించిన వారి కుటుంబాలకు ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలనేది ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము. ఆరోగ్యశాఖ మంత్రి గారు ఉదయం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ విషయంపై చర్చిస్తున్నామని తెలిపారు.
234 1 minute read