వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. వడ్డెరలకు క్వారీల్లో సముచిత స్థానం కల్పించడం జరిగిందని చెప్పారు. ఈమేరకు గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వడ్డెర సొసైటీలకు 15 శాతం అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ లో 15 మంది డైరెక్టర్ల నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం ప్రతినిధులు జాన్ సైదా, మణి కుమారి, మల్లిఖార్జున, సూర్యనారాయణ పాల్గొన్నారు.
247 Less than a minute