రైతులకు మేలు చేసే విధంగా జీఎస్టీ లో మార్పులు లేవని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. ఈమేరకు ఛాంబర్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు శనివారం మీడియాతో మాట్లాడారు. రైతుల తోపాటు యువత, కార్మికులకు కూడా జీఎస్టీ లో శ్లాబుల మార్పు ఉపయోగపడే విధంగా లేదని తెలిపారు. 5-12 కంటే ఎక్కువ ఉండకూడదు అని గతంలో డిమాండ్ చేశామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పైన జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆటోలు, ఫెర్టిలైజర్ మీద కూడా జీఎస్టీ తగ్గించాలని కోరారు.
233 Less than a minute