ఫిరంగిపురంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, కాటూరి మెడికల్ కళాశాల సహకారంతో జరిగింది. శిబిరాన్ని టీడీపీ నాయకులు ప్రారంభించారు.ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్యుల వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఈపూరు పిజిటి ఇంగ్లీష్ టీచర్ వల్లెపు శ్రీను తన సొంత నిధులతో పండ్లు పంపిణీ చేశారు. సాధారణ వ్యాధుల నుండి ప్రత్యేక వైద్య సేవల వరకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
260 Less than a minute