గుంటూరు నగరంపాలెం లోని హజరత్ కాలే మస్తాన్ షా అవులియా 133వ ఉరుసు మహోత్సవాలు ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పలు విశేష పూజలతో ఈనెల 21వ తేదీ వరకు ఉరుసు మహోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా 17వ తేదీ తెల్లవారుజామున చాందిని అలంకరణ, రాత్రి గంధం ఊరేగింపు జరగనుంది. అదేవిధంగా 18వ తేదీ గంధం పంచుట, దీపారాధన జరుగుతుంది. 19వ తేదీ గ్యార్మీ షరీఫ్ ఖురాన్ పఠనం, ప్రసాదం పంచడం నిర్వహిస్తారు. 20వ తేదీ ఫకీర్లకు చద్దరులు పంచడం జరుగుతుంది. 21వ తేదీ బాబా వారు ఆశీనులైన కుర్చీని యదా స్థానంలో ఉంచుతారు. ఉరుసు మహోత్సవానికి సంబంధించిన పోస్టర్లను దర్గా ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు, డూండేశ్వరి, హరికృష్ణ, మస్తాన్ విడుదల చేశారు. దాదాపు లక్ష మంది భక్తులు ఉరుసు మహోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
152 Less than a minute