chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

Karampudui: మొక్కజొన్న పంట ధ్వంసం…

కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ. రామకృష్ణ మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు…

ధ్వంసమైన పొలాన్ని పరిశీలించిన జనసేన మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా. రామాంజనేయులు

పల్నాడు జిల్లా, కారెంపూడి మండలంలోని పెద్దకొదమగుండ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మాడ. రామకృష్ణ వ్యవసాయభూమిలో పండించిన మొక్కజొన్న పంటను కొంతమంది గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. మాడ. రామకృష్ణ పొలానికి వెళ్లి చూసేసరికి పంట పొలం అంతా తొక్కి ధ్వంసం అయ్యి ఉండడంతో సదరు విషయాన్ని స్థానిక పోలిస్ స్టేషన్ లో జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా. రామాంజనేయులు దృష్టికి తీసుకోచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు బుసా. రామాంజనేయులు హుటాహుటిన పెద్దకొదమగుండ్ల గ్రామానికి చేరుకొని మాడ. రామకృష్ణ వ్యవసాయభూమిని పరిశీలించారు. ఈ సందర్బంగా బుసా. రామాంజనేయులు మాట్లాడుతూ అరుకాలం కష్టపడి పండించే పంటలను ధ్వంసం చేయడం మంచి పద్దతి కాదని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అయన కోరారు. అనంతరం మాడ. రామకృష్ణను బుసా. రామాంజనేయులు ఓదార్చి సంఘటనకు కారకులైన వారి పట్ల చర్యలు తీసుకునేలా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా బాధితుని ఫిర్యాదు మేరకు కారంపూడి ఎస్.ఐ వాసు , సి.ఐ టి. వి. శ్రీనివాసరావు, కొదమగుండ్ల చేరుకొని ధ్వంసం అయిన పొలాన్ని పరిశీలించారు. పొలాన్ని పరిశీలించిన వారిలో మండల జనసేన పార్టీ నాయకులు కేసానుపల్లి. కృష్ణబాబు, మండల ఉపాధ్యక్షులు కామేపల్లి. ఏడుకొండలు, కొదమగుండ్ల జనసేన నాయకులు గుబిలి.రామకృష్ణ, కర్నా. రాము, మర్రకుల. జనార్దన్, షేక్. సైదావలి, చచ్చు. కొండలలు తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker