
సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. జిల్లా అందత్వ నివారణ సంస్థ, శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో శుక్రవారం శారదా కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, డివిజన్ కార్యదర్శి ఇరిగినేని వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా అతిధులు తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.







