కూటమి ప్రభుత్వం విజయవంతగా పాలన సాగిస్తూ… ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేసిందని గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలలో ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశాం. రేపు 10న అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయం ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సంక్షేమాలు అమలు చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని, వైసీపీ ఫేక్ ప్రచారానికి తెర లేపింది. ప్రజల్లో ఆందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం జగన్ రెడ్డి దిగజారుడు తననానికి నిదర్శనం. సమస్యలు ఉంటే పప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. కానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా తప్పుడు పత్రికతో తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తూ దిగజారిపోతున్నారు. ప్రతి ఏటా రైతులకు యూరియా అందజేడయం, సాగునీటి సరఫరా, వంటివి చేయడం ప్రభుత్వ పని. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కాలువ పనులైనా చేశారా? ఒక్క ప్రాజెక్ట్ ను అయినా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించారా? ఇవేం చేయకుండా రైతులను నట్టేట ముంచి నేడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. హంద్రీనీవా తో కూటమి ప్రభుత్వ పాలనలో ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది. ఒక్క రూపాయి కూడా హంద్రీనీవా కోసం జగన్ ఖర్చు చేయలేదు. రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా ద్వారా మేలు జరిగిన విషయం వాస్తవం. జగన్ తన హయాంలో 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే తీసుకొచ్చారు. మేం 7 లక్షల యూరియా అందుబాటులో ఉంచాం. లేనిది ఉన్నట్టు చూపించి రైతుల్లో భయాందోళనలు సృష్టించి క్రృతిమ కొరత తెస్తున్నారు. 2025 ఆగస్టుకే 5,69,712 టన్నులు రైతులకు సరఫరా చేసేశాం. ప్రస్తుతం 94,482 వేల టన్నులు సరఫరా చేశాం. ఈ నెలలో 10 లోపు మరో 40 వేల మెట్రిక్ టన్నులతో కలిపి 7 లక్షల టన్నులు యూరియా సరఫరా చేస్తున్నాం. వైసీపీ విధానమే ఫేక్ ప్రచారం చేయడం. రైతుల పట్ల అత్యంత బాధ్యతగా ప్రభుత్వం పనిచేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి సర్వనాశనం చేస్తే… ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేమని వైసీపీ నాయకులే చెబితే… 2027 కి పోలవరం పూర్తి చేసేలా చంద్రబాబు పని చేస్తున్నారని చెప్పారు.
237 1 minute read