శ్రీ కోదండ రామాలయంలో 80వ వార్షిక ధనుర్మాస ఉత్సవాలు……
శ్రీ కోదండ రామాలయంలో 80వ వార్షిక ధనుర్మాత్సవాలు
శ్రీ కోదండ రామస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ, సుఖ సంతోషాలతో జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.గుడివాడ లోని శ్రీ కోదండ రామాలయంలో 80వ వార్షిక ధనుర్మాత్సవాలు వైభవోపేతంగా ముగియడంతో అన్న సమారాధనను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. అన్నదాన మహా కుంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు గత 80 ఏళ్లుగా దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల ముగింపు అన్న సమారాధనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి దీవెనలు రాష్ట్ర ప్రజానీకంపై ఉండాలనిఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షుడు డొక్కు రాంబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, మాజీ ఎంపీపీ గుత్తా చంటి, టిడిపి నాయకులు కడియాల గణేష్,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.