ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట మండలం
నాదెండ్ల మండలంలో గేదెను తప్పించబోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. నాదెండ్ల మండల ఎస్సై పుల్లారావు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఎస్బిఐ క్రెడిట్ కార్డు మేనేజర్ రాజేశ్, నవీన్ అనే సాటి ఉద్యోగితో బైకుపై నరసరావుపేట వైపు వెళ్తున్నారు.ఈ క్రమంలో సాతులూరు వద్ద గేదెను తప్పించబోయి వెనక వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేశ్ కు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు.