
జీవితం అంటే చాయిస్ కాదని మనం తీసుకునే నిర్ణయాలపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఈగల్ టీం విభాగాధిపతి ఐజి ఆకే రవికృష్ణ అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలాజికల్ యూనివర్శిటీ నందు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నిర్వహించిన ర్యాగింగ్, మాదకద్రవ్యాలపై అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, వివిఐటి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ॥ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డా|| వై. మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని వాటినుండి బయట పడటం చాలా కష్టంతో కూడిన అంశం అని అన్నారు. యువత తల్లి దండ్రుల మానసిక బాధను అర్ధం చేసుకొవాలని వారి ఆకాంక్ష మేర మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ద్వారా అనేక ఆపరేషన్లు చేపట్టామని ” ఆసరేషన్ సేవ్ క్యాంపస్” ను ప్రారంభించి విద్యాసంస్థలలో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు సంభందించిన కదలికలు గమనిస్తే 1972 నెంబర్కు కాల్ చేసి తెలపాలని సూచించారు. మన్యం ప్రాంతాలలో గంజాయి సాగును కట్టడిచేసి రైతులకు సత్యామ్నయ పంటలు, ఉపాధి కల్పించామని తెలిపారు.గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మాట్లడుతూ డ్రగ్స్ కేసులలో ఎక్కువ శాతం 25సం|లోపు మువత ఉండటం గమనార్హమని అన్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చెడు స్నేహాలతో మువత మత్తుపదార్థాలకు బానిస అవుతందని వాటికి ఎంత దూరంగా ఉంటే వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుదని అన్నారు.








