
నగర ప్రజలు నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి నగరాభివ్రుద్దికి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. మంగళవారం నగరంలోని వెంకటరామా పౌల్ట్రీస్ మరియు వైష్ణవి కాంప్లెక్స్ వారు వారి 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి ఆస్తి పన్నుకు సంబంధించి చెక్కులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులుకి ఆయన ఛాంబర్ నందు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వారిని అభినందించి మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని వెంకటరామా పౌల్ట్రీస్ వారు వారి టాక్స్ కు సంబంధించి రూ.25,21,397, వైష్ణవి కాంప్లెక్స్ వారు వారి ప్రాపర్టీస్ కు సంబంధించి రూ.13,42,143 విలువ గల చెక్కులను అందజేశారన్నారు. నగర ప్రజలు పాలక సంస్థకు చెల్లించాల్సిన పన్ను బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. నగర ప్రజలు వారి వారి ఆస్తి పన్ను, ఖాళీ స్థల పన్ను, నీటి మీటర్ చార్జీలు సకాలంలో చెల్లించి నగరాభివ్రుద్దికి సహకరించాలని కోరారు. అలాగే రెవిన్యూ విభాగం అధికారులు ఆర్.ఓలు, ఆర్.ఐ లు క్షేత్ర స్తాయిలో పర్యటిస్తూ, మొండి బకాయిల పై ద్రుష్టి సారించి, వాటిని వసూలు చేయాలని ఆదేశించారు.సదరు కార్యక్రమంలో ఆర్.ఐ ఖాజావలి, వెంకటరామా పౌల్ట్రీస్ ప్రతినిధి శివ సత్యనారాయణ, వైష్ణవి కాంప్లెక్స్ ప్రతినిధులు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.








