ఆంధ్రప్రదేశ్గుంటూరు
Tenali: నందివెలుగులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
జెడ్పీ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన భవనాలు, వసతులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనే ముందు ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి పెమ్మసాని పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుట్టిన ఊరికి, పెరిగిన నేలకి సేవ చేయాలని చెప్పినా నందమూరి తారక రామారావు మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని సినిమాల ద్వారా చాటిచెప్పిన ఎన్టీయార్ మాటలను, ఎన్టీయార్ ను పెమ్మసాని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.