ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణయ్య గారు ,సర్కిల్ ఇన్స్పెక్టర్, PS కళాశాల విద్యార్థులలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి అంశాలపై మరియు బాలికలు ఫోన్లు వాడుకలో పాటించవలసిన అప్రమత్తత గూర్చి అవగాహన కలిగించారు.శ్రీమతి శైలజ బాయ్ గారు ఏడి సర్వీసెస్ ,ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ విద్య కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకూడదని పిల్లల్లో శారీరిక మానసిక పరిపాకతను పర్సనాలిటీ డెవలప్మెంట్ కు వారు పెట్టుకునే లక్షణాలను సాధించడానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలిపారు.ఎల్ సి పి ఓ వాసంతి ఇకడ మాట్లాడుతూ ప్రీ మారిటల్ కౌన్సిలింగ్, వివాహ వ్యవస్థ దానికి సంబంధించిన చట్టాలు గూర్చి అవగాహన కలిగించారు.శ్రీ వి సి హెచ్ ప్రసన్నకుమార్ గారు అడిషనల్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ పిల్లలకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, అలా నైపుణ్యాల్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మరి రెస్యూమ్ తయారీ యొక్క ఆవశ్యకత, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం వారు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఏమేమి అవకాశాలు కల్పిస్తున్నారు.స్కిల్ డెవలప్మెంట్ వారి వెబ్ పోర్టల్ గురించి, ఏఐ టెక్నాలజీ గురించి, నైపుణ్యం వల్ల పనిలో నాణ్యత ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.శ్రీమతి కే పద్మ అడ్వకేట్ లీగల్ కౌన్సిలర్ డొమెస్టిక్ వయోలెన్సు సెల్లు ద్వారా ప్రభుత్వం వారు నుంచి సేవలు జెండా అవేర్నెస్, టోల్ ఫ్రీ నెంబర్లు గూర్చి అవగాహన చారు.శ్రీమతి కె శాంతిభూషణ గోపి ,సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వన్ స్టాప్ సెంటర్, మాట్లాడుతూ వన్ స్టాప్ సెంటర్లో అందించు ,5 రకాల సేవలు గూర్చి పిల్లలకి అవగాహన కలిగించారు.శ్రీమతి టి శ్రీవాణి డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పిల్లలకు కావాల్సిన అన్ని రకాల మద్దతులు గైడెన్స్ మిషన్ శక్తి ద్వారా, మిగతా డిపార్ట్మెంట్ల ద్వారా తెలియజేశారు మరియు సి బాక్స్ గురించి అవగాహన కలిగించారు. శ్రీమతి పి పి జి ప్రసూన, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పుడూ తమకు అండగా ఉంటుందని పిల్లలు తమ కాళ్ళ తాము నిలబడాలని, వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఎదగాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలిపారు.శ్రీమతి డాక్టర్ వి ఆర్ జోత్స్నకుమారి ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు పిల్లలకు బాగాఉపయోగపడతాయని, ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని పిల్లలు ఉన్నతంగా ఎదగాలని నలుగురికి ఉపాధి కల్పించే దిశగా తమను తాము చక్కగా రూపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి బి.సుధాకర్ రెడ్డి గారు, కామర్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు మరియు విద్యార్థినులు హాజరయ్యారు
1,236 1 minute read