నరసరావుపేట : ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(అర్,బి) డైరెక్టర్గా నర్సరావుపేట పట్టణానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సెక్రటరీ గా పనిచేస్తున్న వీరవల్లి వంశీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నరసరావుపేట లోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని మరియు నరసరావుపేట జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జీ.వీ.ఎస్ ప్రసాద్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సెక్రటరీ గా పనిచేస్తున్న వీరవల్లి వంశీ ని ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(అర్,బి) డైరెక్టర్గా ముందుగా అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి శ్రమించి జనసేన పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి అని ఈ కష్టాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంశీ చేసే ప్రతి పనిని అభినందించి వంశీకి ఆ పదవి ఇవ్వడం జనసైనికులకి ఎంతో గర్వకారణం అని తెలియజేశారు ఇదేవిధంగా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ లో కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో మీరే స్వయంగా చూశారు ప్రతి ఒక్కరూ కష్టపడండి జనసేనకు మంచి గుర్తింపు తేవాలని తెలియజేశారు. అనంతరం వీరవల్లి వంశీ మాట్లాడుతూ ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీలో నా కష్టాన్ని గుర్తించి నాపై నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కి, ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ కి, జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావుకి, నరసరావుపేట ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సయ్యద్ జిలాని కి నా ప్రత్యేక కృతజ్ఞతలు, మీరు నాపై ఉంచిన నమ్మకంతో ఈ బాధ్యతను మన పార్టీకి మంచి పేరు తీసుకుని వచ్చేలా నడుచుకుంటానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
2,312 1 minute read