
మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదనిఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ తెలిపారు. విద్యారంగ సమస్యలపై ఈనెల 13వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏసీ కళాశాలలో జరిగే సదస్సులో విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు.కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు లింగిశెట్టి బాలనవ్యశ్రీ , అమర్నాథ్, సాగర్, అంకమ్మరావు పాల్గొన్నారు.








