
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు నిర్దేశిత గడువు మేరకు పూర్తీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బృందావన్ గార్డెన్స్, పెదపలకలూరు రోడ్డు, నెహ్రు నగర్ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులు మరియు పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు సమర్దవంతంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి పని నిర్దేశిత గడువు మేరకు పూరి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా బృందావన్ గార్డెన్స్ నందు నూతనంగా నిర్మించిన సి.సి రోడ్డు మరియు సి.సి డ్రైన్ పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనుల నిర్వహణలో తప్పనిసరిగా నాన్యతాప్రమాణాలు పాటించాలని, ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి పనులను క్షేత్ర స్తాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. బృందావన్ గార్డెన్స్ వద్ద గల సర్కిల్ ఆఫీస్ దగ్గర మురుగు నీరు పారుదలకు ఔట్ ఫాల్ డ్రైన్ నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం నెహ్రు నగర్ ప్రాంతంలో పారిశుధ్యం పై పిర్యాదులు అందుతున్న నేపధ్యంలో సదరు ప్రాంతంలో పర్యటించి, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు ప్రాంతంలో పలు చోట్ల డ్రైన్ వాటర్ రోడ్లపైకి వచ్చి ఉండుట చూసి, వెంటనే డ్రైన్ వాటర్ ను బెయిల్ చేయాలని, చెత్త కుప్పలు రోడ్ల పై పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ట్రాన్సిట్ పాయింట్ కు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రజలు వ్యర్ధ్యాలను పారిశుధ్య కార్మికులకు అందజేసే సమయంలో తడి పొడి చేత్తలుగా విభజించి పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. ఎన్విరాన్మేంట్ కార్యదర్శులు తడి పొడి వ్యర్ధాల వేరు చేయుట పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలియచేశారు. పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.








