అనకాపల్లి :ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు
అనకాపల్లి :ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. టీడీపీ శ్రేణుల పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా బత్తుల తాతయ్య బాబు, జనసేన ఇంచార్జీ భీమరశెట్టి రాంకీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద, విజయరామరాజు పేటలో, టీడీపీ పార్లమెంటు కార్యాలయం, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్, అనకాపల్లి మండలం, తుమ్మపాల గ్రామంలో జరిగిన వర్ధంతి వేడుకలలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ జగదీష్, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కశింకోటలోని ఎన్టీఆర్ – బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించి, పేదలకు వస్త్రాలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.