గుంటూరు జిల్లాలో మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.ఈమేరకు విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన తనిఖీల్లో 8.5 గ్రాముల కొకైన్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. రాష్ట్రంలో తొలి కొకైన్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. గుంటూరు నగరంలో ఒక్క గ్రామ్ కోకైన్ 6 వేల నుంచి 3 వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. నల్లచెరువుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటువంటి మాదక ద్రవ్యాలను నగరంలో అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.7 ప్యాకేట్లల్లో ఉన్నటువంటి 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.గంజాయి మాదక ద్రవ్యాలకు సంబంధించిన వివరాలు 14500 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.
247 Less than a minute