ఆంధ్రప్రదేశ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు AP ప్రభుత్వ విప్, యార్లగడ్డ గడ్డ వెంకట్రావ్ వీడ్కోలు…
కృష్ణా జిల్లా: గన్నవరం విమానాశ్రయం రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ వీడ్కోలు పలికారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్న అమిత్ షా కు యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపి వీడ్కోలు పలికారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NIDM ) దక్షిణ భారత క్యాంపస్ ప్రారంభంతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF ) 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం తెలిసిందే.